బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్

Telugu Lo Computer
0


తెలంగాణ బీజేపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఇవాళ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,చేరికలు కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. బూర నర్సయ్య గౌడ్ తో పాటు కూకట్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. బూర నర్సయ్య గౌడ్ బుధవారం బీజేపీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ,తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అనంతరం బీజేపీ నేషనల్​ చీఫ్ జేపీ నడ్డాను, కేంద్ర మంత్రి అమిత్ షాను నర్సయ్య కలిసే అవకాశం ఉంది. బంగారు తెలంగాణే తమ ఎజెండా అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. తొలి, మలి దశ తెలం గాణ పోరాటంలో ఆనాటి యువకులు కలలు కన్న బంగారు తెలంగాణ స్వప్నాన్ని కేసీఆర్ చోరీ చేశారన్నారు. బంగారు తెలంగాణకు బదులు, బం గారు కేసీఆర్ ఫ్యామిలీ నిర్మించుకున్నారని ఫైర్ అయ్యారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. మంగళవారం ఢిల్లీ సౌత్​ ఎవెన్యూలోని తరుణ్​ చుగ్​ నివాసంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆయన్ను కలిశారు. అర గంటకు పైగా సాగిన భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, మునుగోడు స్ట్రాటజీ, రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశాలపై చర్చించారు. అంతకు ముందు తరుణ్​చుగ్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అయిన నర్సయ్య గౌడ్​ సమా జంలో చెత్తను క్లీన్ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, ఉద్యమకారుడైన నర్సయ్యను బీజేపీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)