12 ఏళ్ల బాలుడికి 2.9 లక్షల ఫైన్ !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని 12 ఏళ్ల బాలుడికి ఖర్గోన్‌లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండలో జరిగిన నష్టానికి 2.9 లక్షల జరిమానా చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బాలుడు అతని తండ్రితో పాటు మరో ఆరుగురికి ప్రభుత్వం నోటీసులు పంపింది. ఏప్రిల్ 10న రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండలో తమ ఆస్తికి నష్టం వాటిల్లిందని, ఈ ఘటనలో బాలుడు క్రియాశీలకంగా పాల్గొన్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు నష్టపరిహారం కింద బాలుడికి రూ.2.9 లక్షలు, బాలుడి తండ్రికి 4.8 లక్షల జరిమానా విధిస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు రామనవమి తర్వాత ఈ ఘర్షణలకు సంబంధించి ట్రైబ్యునల్ కు 343 పైగా ఫిర్యాదులు రాగా.. వాటిలో 34 ఫిర్యాదులను మాత్రమే స్వీకరించింది. నిరసనలు, సమ్మెలు, హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే వారి నుంచి రికవరీ చేయడానికి పబ్లిక్ ప్రావర్టీ, నష్టాల నివారణ-రికవరీ బిల్లును మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే బాలుడికి, అతని తండ్రికి క్లెయిమ్ ట్రెబ్యునల్ నష్టపరిహారం కింద జరిమానా విధిస్తూ నోటీసులు పంపింది. అయితే దీనిపై బాలుడి తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు మైనర్ అని.. అల్లర్లు జరిగినప్పుడు తామంతా నిద్రపోతున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. తమ కొడుకును పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రతి రోజు తాము భయపడుతున్నామని ఆమె చెప్పింది. శ్రీరామ నవమి ఊరేగింపు సమయంలో దుండగులు శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇదే హింసాత్మక ఘటనలకు కారణం అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)