ఐఆర్‌సీటీసీ సమోసాలో కాగితం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 October 2022

ఐఆర్‌సీటీసీ సమోసాలో కాగితం !

రైళ్లలో అమ్ముతున్న ఆహారం శుభ్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ముంబయి-లఖ్‌నవూ రైళ్లో ప్రయాణించే ఓ వ్యక్తి సమోసా కొంటే తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ట్విటర్‌ లో పోస్ట్ చేశాడు. ఐఆర్‌సీటీసీ నిర్వహించే ప్యాంట్రీ సిబ్బంది నుంచి తాను ఓ సమోసాను కొనుగోలు చేయగా అందులో ఓ పచ్చ కాగితం ఉందంటూ ఆ ఫొటోను అజి కుమార్‌ అనే వ్యక్తి షేర్‌ చేశాడు. ''అక్టోబర్‌ 9వ తేదీన బాంద్రా నుంచి లఖ్‌నవూకి 20921 నంబరు గల రైళ్లో వెళ్తూ ఐఆర్‌సీటీసీ ప్యాంట్రీ సిబ్బంది విక్రయించిన సమోసా కొన్నాను. సగం తిన్న తర్వాత అందులో ఈ 'పచ్చ పేపర్‌' కనిపించింది'' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా ఆ ట్వీట్‌పై ఐఆర్‌సీటీసీ స్పందించింది. అజి కుమార్‌ను క్షమాపణలు కోరింది. 'సార్‌, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ పీఎన్‌ఆర్‌, మొబైల్‌ నంబర్‌ను డీఎంలో షేర్‌ చేయండి' అంటూ పేర్కొంది. 'ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంటాం' అంటూ మరో ట్వీట్‌ చేసింది. అయితే, ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment