జీన్స్‌ ప్యాంట్‌ 60 లక్షలు !

Telugu Lo Computer
0


అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)