32 ఏళ్ల తర్వాత కరాచీకి న్యూజిలాండ్ క్రికెట్ టీమ్

Telugu Lo Computer
0


న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 32 ఏళ్ల తర్వాత కరాచీలో పర్యటించబోతుంది. పాక్తో ద్వైపాక్షిక సిరీస్లలో భాగంగా కివీస్ టీమ్ కరాచీలో ఆడబోతుంది. ఈ టూర్కు సంబంధించిన షెడ్యూల్ను పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 2022 చివరి వారం నుంచి..2023 జనవరి రెండో వారం వరకు న్యూజిలాండ్ పాక్తో మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్, మేల నెలల్లోనూ రెండు జట్లు మరోసారి క్రికెట్ మ్యాచులు ఆడబోతాయి. పాకిస్తాన్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్.. ఆ జట్టుతో వన్డేలు, టీ20 సిరీస్లు ఆడనుంది. తొలి పర్యటనలో భాగంగా డిసెంబర్ 27 నుంచి జనవరి 15వరకు.. రెండు టెస్టులు, మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 13 నుంచి మే 7 వరకు ఐదు టీ20లు, 5 వన్డేలు జరుగుతాయి. మొదటి టెస్ట్ డిసెంబర్ 27 నుండి 31వరకు కరాచీలో జరుగుతుంది. రెండో టెస్ట్ ముల్తాన్ వేదికగా జనవరి 4 నుంచి జరగనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో భాగంగా ఈ టెస్టులు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 11, 13, 15న మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మూడు వన్డేలు కరాచీలోనే జరగనుండటం విశేషం. న్యూజిలాండ్ టీమ్ చివరి సారిగా 1990 అక్టోబర్లో కరాచీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఇప్పుడే కరాచీలో మ్యాచ్లు ఆడబోతుంది. అంటే 32ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు కరాచీలో అడుగుపెట్టబోతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)