సీఐ నాగేశ్వరరావు పోలీస్‌ శాఖ సర్వీస్‌ నుంచి తొలగింపు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 October 2022

సీఐ నాగేశ్వరరావు పోలీస్‌ శాఖ సర్వీస్‌ నుంచి తొలగింపు !


మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వివాహితపై అత్యాచారం, అపహరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు 3 నెలల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టికి వనస్థలిపురం పోలీసులు తీసుకెళ్లారు. దీంతో సీవీ ఆనంద్ వెంటనే నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేశారు. రెండున్నర నెలలకు పైగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండుసార్లు ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ తిరస్కరణకు గురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన నాగేశ్వర్‌రావుకు సెప్టెంబర్ 28న షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో నాగేశ్వర్‌రావు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. పోలీస్ ఉన్నతాధికారులు నాగేశ్వరరావుపై నమోదైన కేసును తీవ్రంగా పరిగణించారు. అన్యాయం జరిగిన వాళ్లకు తగిన న్యాయం చేయాల్సిన పోలీసులే.. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వర్‌రావును విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

No comments:

Post a Comment