24నే దీపావళీ !

Telugu Lo Computer
0


పంచాంగం ప్రకారం ఈ నెల 24న దీపావళీ జరుపుకోవాలని, సాధారణంగా అశ్వయుజ మాసం, బహుళ అమావాస్య రోజున  దీపావళీ జరుపుకోవడం ఆనవాయితీ. ఇది క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25న వస్తోంది. దీంతో 25, మంగళవారం దీపావళీ అనుకుంటున్నారు చాలా మంది. కానీ, పండితులు మాత్రం 24న జరుపుకోవాలి అని చెబుతున్నారు. దీనికి కారణం ఉంది. దీపావళి వేడుకల్ని ప్రదోష వేళలో నిర్వహిస్తారు. అంటే సూర్యాస్తమయం తర్వాత.. చీకటి పడ్డాక దీపావళి జరుపుతారు. దీని ప్రకారం 25, మంగళవారం అమావాస్య రోజు చీకటి పడేసరికి పాడ్యమి ఘడియలు వస్తున్నాయి. అంటే 25, సాయంత్రం 4.25 నిమిషాలకల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వస్తుంది. మంగళవారం సూర్యాస్తమయం అయ్యే సమయానికి అమావాస్య పోతుంది. అందువల్ల సోమవారమే దీపావళి జరుపుకోవాలి అంటున్నారు. సోమవారం సాయంత్రం 4.25 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. అంటే సోమవారం రోజే అమావాస్య ఘడియలు ఉంటాయి. కాబట్టి, ఆ రోజే దీపావళి నిర్వహించుకోవడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు. క్యాలెండర్ ప్రకారం మంగళవారం అమావాస్య ఉన్నప్పటికీ, ఆ రోజు సాయంత్రానికి అమావాస్య ఘడియలు ముగిసిపోతున్న కారణంగా సోమవారమే  దీపావళీ అని సూచిస్తున్నారు. అలాగే  దీపావళీ సోమవారం నిర్వహించుకోవడానికి, గ్రహణానికి కూడా సంబంధం లేదంటున్నారు. మంగళవారం గ్రహణం ఉండటం వల్లే  దీపావళీని సోమవారానికి మార్చారు అనడం సరికాదని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య ఘడియను అనుసరించి మాత్రమే 24, సోమవారం  దీపావళీ నిర్వహించుకోవాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)