మా అమ్మను అరెస్ట్ చేయండి !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక 3 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి  తల్లి తనను కొట్టిందని, తన క్యాండీలు దొంగిలించిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడున్న మహిళా పోలీస్ అధికారి ఆ బాలుడి చెప్పినట్లుగానే అన్నీ రాసుకుంది. వీడియోలో బాలుడు చెప్పినదాన్ని బట్టి.. “తన తల్లి తనను చెంపదెబ్బ కొట్టిందని, తన క్యాండీలు మరియు చాక్లెట్‌లను దొంగిలించినందున తల్లిని లాక్కెళ్లమని మహిళా పోలీసు అధికారిని కోరుతుండడం మనం వినవచ్చు. సదరు పోలీసు అధికారి తల్లి పేరు ఏంటి? అని అడిగినప్పుడు అతను కేవలం “మమ్మీ” అని చెప్తున్నాడు”. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే మూడేళ్ళ బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు సమస్యను వివరించి న్యాయం చేయమని అడుగుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే.. కంప్లైంట్ తీసుకుంటున్నట్లుగా అతను చెప్పిన విషయాల్ని ఓ పేపర్‌పై రాసుకొచ్చిన మహిళా సబ్‌ ఇన్స్‌పెక్టర్ పై కూడా ప్రశంశలు కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)