గోవాలో నవంబర్ 20 నుంచి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌!

Telugu Lo Computer
0


నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించే సినిమాల వివరాలను ఇండియన్ పనోరమా ప్రకటించింది. ఈ సారి 25 ఫీచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ను ప్రదర్శించనున్నారు. తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలకు గుర్తింపు లభించింది. మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో ఈ రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కింది. ఆర్ ఆర్ ఆర్, అఖంఢలతో పాటు కాశ్మీర్ ఫైల్స్ (హిందీ), టోనిక్ ( బెంగాలీ), ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) సినిమాలను ప్రదర్శించనున్నారు. ఫీచర్ ఫిలిమ్స్ విభాగంలో సినిమా బండి, ఖుదీరాం బోస్ బయోపిక్ ను కూడా ప్రదర్శించనున్నారు. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు... ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావత్‌ వ్యవహరించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)