వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్  బకావా గ్రామం ఖర్‌గోన్‌లో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు చిన్నారిపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. చిన్నారి అరుపులు విని స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చిన్నారి సోనియా ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి రోజూకూలీగా పనిచేస్తున్నాడు. తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రోదించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)