మనిషికి 10కిలోల చొప్పున ఉచిత రేషన్‌ బియ్యం

Telugu Lo Computer
0


తెలంగాణలో  రేషన్‌ లబ్ధిదారులకు  మనిషికి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2.84 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని సివిల్‌ సప్లయ్​ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల మందికి 5కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందని, మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తిగా సబ్సిడీ భరించి ఫ్రీ రేషన్ సరఫరా చేస్తుందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలానికి పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన స్కీంను కేంద్రం పొడిగించిందని తెలిపారు. దీనికోసం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల టన్నుల బియ్యం అదనంగా తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు. వీటికి నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అదనంగా రూ.227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందని గంగుల కమలాకర్ వివరించారు. పీఎంజీకేఏవై స్కీం ప్రారంభం నుంచి 25 నెలలకు బియ్యం కోసం రూ.1,308 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వలస కూలీలకు రూ.500, ప్రతీ కార్డుకు 2నెలల పాటు రూ.1,500 చొప్పున రూ.2,454 కోట్లు అందజేశామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)