దసరా ప్రత్యేక రైళ్లు

Telugu Lo Computer
0


సికింద్రాబాద్, విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లను నడపనున్నాయి. సికింద్రాబాద్‌-తిరుపతి(02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరనుంది. ఈరైలు అక్టోబర్ 2న ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. అదే రైలు(02763) తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2న సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి కదలనుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ రానుంది. ఈట్రైన్‌ జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణి గుంట స్టేషన్లలో ఆగనుంది. సికింద్రాబాద్-యశ్వంతపూర్(07233) రైలు సెప్టెంబర్ 29, అక్టోబర్ 6,13, 20 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి వెళ్లనుంది. మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్‌కు ప్రత్యేక రైలు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈరైలు(07234) సెప్టెంబర్ 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో ప్రారంభంకానుంది. మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్‌ రానుంది. నరసాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్‌ నడవనుంది. ఈవిషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. నరసాపూర్-సికింద్రాబాద్(07466) రైలు ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్ నుంచి బయలు దేరనుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ రానుంది. సికింద్రాబాద్-నరసాపూర్(07467) ట్రైన్ అక్టోబర్ 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు కదలనుంది. మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈట్రైన్ పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌ల మీదుగా వెళ్లనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)