'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'పై నిషేధం

Telugu Lo Computer
0


పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాని అనుబంధ సంస్థలు 'చట్టవిరుద్ధమైన సంస్థలు' అని కేంద్రం ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పీఎఫ్ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. "రహస్య ఎజెండాను అమలుచేస్తూ ఒక వర్గాన్ని పీఎఫ్ఐ ప్రభావితం చేస్తోందని" ఈ నోటీసులో పేర్కొంది. "పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు లేదా సంబంధిత సంస్థలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలుగా పనిచేస్తాయి. అవి ఒక రహస్య ఎజెండాను అమలుచేస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇది దేశ సమైక్యతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ప్రజా శాంతికి, సామరస్యానికి ఆంటకం కలిగిస్తుంది. దేశంలో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తుంది" అని నోటిఫికేషన్‌లో రాసినట్లు ఏఎన్ఐ తెలిపింది. అంతే కాకుండా, "పీఎఫ్ఐకి క్రిమినల్, ఉగ్రవాద కేసులతో సంబంధం ఉంది. ఇది దేశ రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరుస్తుంది. దేశం బయటి నుంచి నిధులు తీసుకుంటూ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చు" అని పేర్కొంది. గతంలో భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నిషేధం విధించిన రెండు సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)