కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో దిగ్విజయ్ సింగ్‌

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకోనున్న దిగ్విజయ్ సెప్టెంబర్ 30న తన నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాజస్ధాన్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు నేపధ్యంలో అశోక్ గెహ్లాట్ అభ్యర్ధిత్వంపై సందిగ్ధం నెలకొనగా తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో దిగ్విజయ్ సింగ్‌, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున్ ఖర్గే పేర్లు ముందువరసలో నిలిచాయి. అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోననే నిర్ణయానికి రాహుల్ గాంధీ కట్టుబడిఉండటంతో ఎన్నిక అనివార్యం కానుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. ఆపై తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. జీ-23గా పేరొందిన అసంతృప్త నేతల నుంచి విమర్శలు రావడంతో 2020 ఆగస్ట్‌లో పార్టీ చీఫ్‌గా వైదొలగేందుకు సోనియా సిద్ధమవగా ఆ పదవిలో కొనసాగాలని సీడబ్ల్యూసీ ఆమెకు విజ్ఞప్తి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)