దేశంలో 5జీ సేవలు షురూ !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఆరవ  ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ ను ప్రధాని మోడీ లాంచ్ చేశారు. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందిస్తున్నారు. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పునె, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు. ప్రస్తుతం మనం 4 జీ సేవలు వాడుతున్నాం. దీనికి కంటే మెరుగైన సేవలు 5జీ తో అందుతాయి. 4 జీలో గరిష్ట డౌన్ లోడ్ వేగం 1 GBPS. అయితే 5జీలో 10 GBPS. దీంతో ఎక్కువ క్వాలిటీ, డ్యురేషన్ ఉన్న వీడియోలను, సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 4 జీ - 5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధాన తేడా సమాచారం ప్రసారమయ్యే విధానం. 4 జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నంచి ప్రసారం అవుతాయి. 5జీలో స్మాల్ సెల్ టెక్నాలజీ వాడుతారు. చిన్న బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ తో హై బ్యాండ్ సేవలు అందుతాయి. ఐతే ఈ బాక్సులను అమర్చలేని చోట తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రాంతాల్లో సెల్ టవర్లనే వినియోగిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)