రేపటి నుంచి 5జీ సేవలు !

Telugu Lo Computer
0


దేశంలో 5జీ సేవలు అక్టోబర్ 1న ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. దశలవారిగా దేశవ్యాప్తంగా ఈసేవలు రానున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈకార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ప్రగతి మైదానంలో ఆరో విడత ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2022 సదస్సు జరగనుంది. ఈసందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభోత్సం చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు 5జీ సేవలను ప్రారంభిస్తారు. ఐతే ఏ ఏ నగరాల్లో ప్రారంభంకానుందన్న విషయంపై క్లారిటీ రాలేదు. 5జీ ద్వారా అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలతోపాటు ఇతర ఉపయోగాలు కల్గనున్నాయి. 4జీ పోలిస్తే అత్యంత వేగంగా 5జీ సేవలు ఉండనున్నాయి. దీని వల్ల ఏ వీడియోనైనా కొద్ది సెకన్లలోనే డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ లెన్త్ హై క్వాలిటీ వీడియోలు సైతం చిటికెలో డౌన్‌లోడ్ కానున్నాయి. ఇటీవల వేలం ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని జియో రూ.88, 078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18 వేల 799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. అక్టోబర్‌లోనే కొత్త సేవలు రానున్నాయని ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)