పెళ్ళి భోజనం తిన్నాక బిల్లు కట్టాలి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 8 August 2022

పెళ్ళి భోజనం తిన్నాక బిల్లు కట్టాలి !


తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే, వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెట్టే స్తోమత తమకు లేదని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తన పెళ్ళికి గిఫ్టులకు బదులుగా భోజనం తిన్న తర్వాత ఆ ఆహారానికి బిల్లు చెల్లిస్తే చాలని చెప్పింది. అయితే, ఫేస్ బుక్ లో ఆమె చేసిన ఈ పోస్టుకు దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు నెటిజన్లు. ఆ అమ్మాయి చేసిన పోస్టును రెడ్డిట్ గ్రూప్ r/weddingshamingలోనూ పోస్ట్ చేశారు. అతిథులు భోజనం తిన్న తర్వాత అందుకు ఎవరన్నా బిల్లు కట్టాలని అడుగుతారా? అంటూ కొందరు కామెంట్లు చేశారు. 'అయ్యయ్యో నేను ఓ పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది భోజనం చేశాక బిల్లు అడగరు కదా?' అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. హోటల్ లో తిన్న ఆహార పదార్థాలకు బిల్లు కడతాం.. పెళ్ళిలో తిన్నదానికి కూడా కట్టాలని అడిగితే ఎలా? అని కొందరు స్పందించారు. 'నేను ఆ అమ్మాయికి ఓ పరిష్కార మార్గం చెప్పాలనుకుంటున్నాను. 30 మందినే పెళ్ళికి పిలిచి వారికి ఉచితంగా భోజనం పెట్టండి' అని ఒకరు పేర్కొన్నారు. మొత్తానికి ఆ అమ్మాయి చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

No comments:

Post a Comment