ఇండిగో విమానం కిందకు దూసుకొచ్చిన కారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 August 2022

ఇండిగో విమానం కిందకు దూసుకొచ్చిన కారు !


ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా, మరో విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు చెందిన కారు ఒకటి దాని కిందకు దూసుకొచ్చింది. విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం కొద్దిలో తప్పింది. మంగళవారం ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని టెర్మినల్ 2 స్టాండ్ నంబరు 201 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ స్టాండ్ వద్ద ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం సిద్ధంగా ఉంది. మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ ఉండగా, గో ఫస్టుకు చెందిన ఓ మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు విమానం ముందు భాగం కిందకు దూసుకొచ్చింది. అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే ఆపడంతో విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం తృటిలో తప్పింది. కారు డ్రైవర్ మద్యం సేవించాడేమో అన్న అనుమానంతో ఎయిర్ పోర్టు అధికారులు అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తుకు ఆదేశించింది. ఇండిగో విమానం షెడ్యూల్ ప్రకారమే పాట్నా బయల్దేరినట్టు అధికారులు వెల్లడించారు.

No comments:

Post a Comment