రతన్‌ టాటా పోన్‌ కాల్‌ కంపెనీ స్థితినే మార్చింది ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 8 August 2022

రతన్‌ టాటా పోన్‌ కాల్‌ కంపెనీ స్థితినే మార్చింది !


రెపోస్‌ ఎనర్జీ అనేది స్టార్టప్‌ కంపెనీ, యాప్‌ ద్వారా డీజిల్‌ని ఇంటికి డెలివరీ చేస్తుంది. టాటా మోటర్స్‌ నుంచి సెకండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ని అందుకున్న కంపెనీ కూడా. అయితే రతన్‌ టాటా నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌ తమ కంపెనీ స్థితిని ఏవిధంగా మారిందో రెపోస్‌ ఎనర్జీ సహా వ్యవస్థాపకురాలు అదితి భోసలే వాలుంజ్‌ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు అదితి భోసలే వాలుంజ్‌ మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం తాను తన భర్త చేతన్‌ వాలుంజ్‌ రెపోస్‌ ఎనర్జీని ప్రారంభించాలనుకున్నారు. తమ సంస్థ బాగా ఎదగాలంటే మంచి మార్గ నిర్దేశం చేసే వ్యక్తి అవసరమని అనుకున్నారు. వారిద్దరు రోల్‌మోడల్‌గా తీసుకునేది రతన్‌ టాటానే. అందుకని ఆయన్నే కలుద్దాం అని అదితి తన భర్తతో అంది. ఆయన ఏమి మన పక్కంటి వ్యక్తి కాదు సులభంగా కలవడానికి అని ఆమె భర్త వ్యగ్యంగా అన్నారు. అంతేగాక చాలామంది కూడా అసాధ్యం అని నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ అదితి తన పట్టువదల్లేదు. ఎలాగైన కలవాలనుకుంది. అందుకోసం తన రెపోస్‌ కంపెనీ ఉద్దేశాన్ని వివరిస్తూ త్రిడీ ప్రెజెంటేషన్‌ సిద్దం చేసింది. అంతేగాక రతన్‌ టాటా ఇంటి బయట భార్యభర్తలిద్దరూ పడిగాపులు కాయడమే గాక రాతపూర్వకంగా ఒక లేఖను కూడా రతన్‌ టాటాకు అందేలా కొందరి సాయం తీసుకుంది. అయినా ప్రయోజనం ఏమి లేకపోయింది. చివరికి రతన్‌ టాటి ఇంటి వద్ద చాలా సేపు వెయిట్‌​ చేసి ఇక నిరాశగా హెటల్‌కి వెళ్తుండగా సుమారు రాత్రి 10 గం.ల సమయంలో రతన్‌ టాటా నుంచి వారికి ఫోన్‌ వచ్చింది. ఇక వారి ఆనందానికి అవధులే లేవు. అంతేకాదు రతన్‌ టాటా ఫోన్‌లో 'హయ్‌ నేను రతన్‌ టాటా' అదితితో మాట్లాడవచ్చా! అని అడిగారు. ఐతే అదితికి నమ్మశక్యంగా అనిపించకపోవడంతో ఎవరూ మీరంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం అవగతమైంది. మరుసటి రోజే రతన్‌ని కలిసి తన కంపెనీ గురించి వివరించింది. ఐతే టాటా తన నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగారు. తమకు దేశానికి సేవ చేయడంలో సాయం చేయడమే గాక వ్యాపారంలో మార్గనిర్దేశం చేయమని అడిగాం అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు అదితి భోసలే. ఆ రోజు తర్వాత నుంచి తమ కంపెనీ దిశ మారిపోయిందని అన్నారు.

No comments:

Post a Comment