ఏనుగులతో సెల్ఫీ !

Telugu Lo Computer
0


కొందరు యువకులు అటవీ మార్గం గుండా వెళుతుంటే అక్కడ ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఈక్రమంలో ఆ యువకులు ఏనుగులతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. దూరంగానే కారు ఆపి ఏనుగుల వైపు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఆగ్రహించిన ఏనుగులు వారివైపు దూసుకు వచ్చాయి. దీంతో యువకులు పరుగు లంకించుకున్నారు. ఏనుగులు కూడా తమ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహూ శనివారం తన ట్వి్ట్టర్ లో పోస్టు చేశారు. జంతువులతో సెల్ఫీలు ప్రమాదకరమని హెచ్చరించారు. 'వన్యప్రాణులతో సెల్ఫీ మోజు ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యక్తులు అదృష్టవంతులు. సున్నితమైన ఏనుగుల గుంపు వారి ప్రవర్తనను క్షమించాయి. లేకపోతే శక్తివంతమైన అవి వారికి గుణపాఠం చెప్పడానికి పెద్దగా సమయం పట్టదు' అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 63 వేలకుపైగా ఈ వీడియోను తిలకించారు. నెటిజన్లు కూడా ఆ వ్యక్తుల తీరుపై తమదైన శైలిలో స్పందించారు. ఒకవేళ ఏదైనా జరుగరానిది జరిగితే జంతువులనే తప్పుపడతారని ఒకరు అన్నారు. వన్యప్రాణులతో చెలగాటమాడేవారికి భారీగా జరిమానాలు విధించాలని మరొకరు డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)