వర్షంలో భుజాలపై కొడుకు శవాన్ని మోసిన తండ్రి

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని ప్రగ్యారాజ్‌, డేహా గ్రామానికి చెందిన భజరంగి యాదవ్ కొడుకు శుభమ్‌కు కరెంట్ షాక్ తగిలింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడ్ని ప్రగ్యారాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. దీంతో తన కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయమని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులను కోరాడు. దీనికి వైద్య సిబ్బంది నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్స్‌లోనే తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ప్రైవేటు అంబులెన్స్ కోసం ప్రయత్నించాడు. వాటికి డబ్బులు చెల్లించేందుకు సరిపడా స్థోమత లేకపోవడంతో, చివరకు తన భుజాలపైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు. అలా కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచాడు. తర్వాత ఒక కారు డ్రైవరు సహాయం చేయడం వల్ల కొడుకు మృతదేహంతో నివాసానికి చేరుకున్నాడు. అయితే, ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)