ఆహార విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


భోజనం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను  చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలా చేయడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఉందంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ఆ సమయాన్ని తరచూ మార్పులు చేస్తే ఇబ్బందులు తప్పవు. పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే ఈ భోజనానికి ముందు అంటే ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే ఇది కడుపు ఆమ్లతను తగ్గిస్తుంది. పెరుగు ఎల్లప్పుడూ భోజనం తర్వాత తినాలి. ఇలా చేయడం ద్వారా ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది. కండరాలను అభివృద్ధి చేయడంతోపాటు బలపరుస్తుంది. అన్నం రాత్రిపూట తినకూడదు. బియ్యం కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. కావున ఇది జీర్ణక్రియకు సమయం పడుతుంది. ఇందులో ఉండే అధిక కేలరీలు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. పాలలో దాదాపు అన్ని పోషకాలు దాగున్నాయి. అందుకే పాలను పూర్తి ఆహారంగా పరిగణిస్తారు. అయితే.. వేడి పాలు జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి చాలా వేడి పాలు ఎప్పుడూ తాగకూడదు. అయితే గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అరటి పండును ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకండి. ఇది శక్తిని హరించడం మాత్రమే కాకుండా డయేరియా, పేగు సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అరటి పండు కొద్దిగా కడుపు నిందుగా వున్నప్పుడే తినాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)