సోలార్ ప్లాంట్‌తో సిరుల పంట !

Telugu Lo Computer
0


వ్యవసాయ భూమి ఉంటే అందులో భారీ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దానిని నుంచి ఉత్పత్తయ్యే కరెంట్‌ను ప్రభుత్వానికి విక్రయించి.. ఆదాయం పొందవచ్చు. రెండు ఎకరాల భూమిలో 1.1 మెగా వాట్స్ సామర్థ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం 330 వాట్స్ కెపాసిటీ గల 3400 సోలార్ ప్యానెల్స్‌ అవసరమవుతాయి. ఈ ప్లాంట్‌లో ప్రతి రోజూ సగటున 5వేల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఎండాకాలంలో రోజుకు 5,500 యూనిట్లు, శీతాకాలంలో 3500 విద్యుత్ తయారవుతుంది. సోలార్ ప్లాంట్‌లో డీసీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ఏసీగా మార్చి.. ఏదైనా ప్రైవేట్ సంస్థలకు విక్రయించవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం కుసుమ్ యోజన కింద విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే 25 ఏళ్ల పాటు ఖచ్చితమైన ధర వస్తుంది. మీ ప్లాంట్‌లో ప్రతి రోజు 5వేల యూనిట్స్ కరెంట్ తయారై, ఒక్కో యూనిట్‌కు రూ.4 చొప్పున విక్రయిస్తే  రోజుకు రూ.20వేల ఆదాయం వస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.6 లక్షల వరకు సంపాదించవచ్చు. అయితే ఇందులో ఉన్న పెద్ద అవరోధం అంటంటే.. పెట్టుబడి..! ఈ స్థాయిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోట్లల్లో ఖర్చవుతుంది. 1 మెగా వాట్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు. రాజస్థాన్లోని కోట్‌పుత్లి పట్టణానికి చెందిన అమిత్ సింగ్ యాదవ్ అనే డాక్టర్.. తన వ్యవసాయ భూమిలో ఇలాంటి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. భారీగా ఆదాయం పొందుతున్నాడు. పీఎం కుసుం యోజన కింద ప్రభుత్వానికే విద్యుత్‌ను విక్రయిస్తూ.. ప్రతి నెలా రూ. 6 లక్షలు సంపాదిస్తున్నాడు. పెట్టుబడి డబ్బులను బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నానని.. నాలుగైదేళ్లలో ఆ రుణాన్ని క్లియర్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చే ఆదాయమంతా లాభాలేనని వెల్లడించారు. ఈయన ప్లాంట్ చూసిన తర్వాత.. చాలా మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)