హీరోగారి ఓవరాక్షన్‌ కి చెంప చెల్లుమంది !

Telugu Lo Computer
0


శ్రీమతి శ్రీనివాస్‌ సీరియల్‌ షూటింగ్‌ సందర్భంగా హీరో పై జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం రేపింది. టెక్నీషియన్‌ తల్లిని ధూషించినందుకు అందరి ముందు సారీ చెప్పక తప్పలేదు మన హీరో గారికి. ఓ పక్క పరువై పోయి, మరో పక్క రౌడీగా మిగిలిపోయాడు హీరో. తాజాగా ఈ ఘటన జరగ్గా..ఈవీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో చందన్ చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కన్నడలో 'రాధా కళ్యాణ', 'లక్ష్మీ బారమ్మ' వంటి సీరియల్స్‌లో నటించడమే కాకుండా.. రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నాడు. అంతేకాదు బిగ్ బాస్ కన్నడ సీజన్ 3 షోకి కంటెస్టెంట్‌ కూడా వెళ్లాడు. చందన్ 2021 లో టీవీ నటి కవితా గౌడను వివాహం చేసుకున్నాడు. అయితే ఈఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈహీరో చేసిన పని తన కేరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనుందో.. సీరియల్స్ కొనసాగనిస్తారా? లేదా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదైతేనే ఈ ఘటన హీరో కేరీర్ పై దెబ్బ పడేటట్లే వుంది. చిన్న పెద్ద అనే తారతమ్యం చూసేవారికి ఇలానే జరగాలి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి హీరో గారి పరిస్థితి ఎలా వుండనుందో?

Post a Comment

0Comments

Post a Comment (0)