యుద్ధ విమానాన్ని నడిపిన ఐఏఎఫ్‌ చీఫ్‌

Telugu Lo Computer
0


భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్‌ చౌదరి స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే 1 'తేజస్'తోపాటు లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌, హెట్‌టీటీ-40ను నడిపారు. రెండు రోజుల పర్యటన కోసం కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే 1 'తేజస్', లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌, హెట్‌టీటీ-40ను ఆయన పరిశీలించారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)లో వీటిని ప్రవేశపెట్టడంపై సమీక్షించారు. అంతేగాక వాటిని స్వయంగా నడిపి పరీక్షించారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఒక ట్వీట్‌ చేసింది. 'చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ (సీఏఎస్‌) రెండు రోజుల పర్యటన కోసం బెంగళూరు వెళ్లారు. తేజస్ ప్రోగ్రామ్‌ అప్‌గ్రేడ్‌, రెండు ఇతర స్వదేశీ తయారీల సామర్థ్యాన్ని పరిశీలించారు. వాటి ప్రస్తుత స్థితి, భవిష్యత్‌ ప్రణాళికలపై టెస్ట్ సిబ్బంది, డిజైనర్‌లతో ఆయన చర్చించారు' అని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఐఏఎఫ్‌ విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)