చిన్నారిని నాల్గొవ అంతస్థు కిందకు పడేసిన తల్లి !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బెంగళూరు, ఎస్ఆర్ నగర్ లో ఒక మహిళ నాలుగో అంతస్థులో బాల్కనీలో నిలబడీ తన కూతురుని కిందకు విసిరేసింది. దీంతో చిన్నారి తలపగలి అక్కడికక్కడే చనిపోయింది. ఈ క్రమంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ప్రకారం.. నాలుగేళ్ల బాలికకు మాటలు రావని, వినబడదని అందుకే తల్లి ఇలా చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాలిక తండ్రి సాఫ్ట్ వేర్ ఇంజినీర్, తల్లి డెంటల్ డాక్టర్. అయితే తల్లి మానసిక ప్రవర్తనపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళ కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం తల్లి కింద విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్లిప్పింగ్స్ వైరల్ గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)