ఆగస్టు, సెప్టెంబరు సాధారణ వర్షపాతం

Telugu Lo Computer
0


ఆగస్టు, సెప్టెంబరులో దేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య, దక్షిణ, మధ్య భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. తూర్పు, ఈశాన్య భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడుతుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా తప్ప మిగతా ప్రాంతాల్లో అలాగే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని తూర్పుప్రాంతంలో, రాజస్థాన్, కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడుతాయని చెప్పింది. పలు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదు కానుందని పేర్కొంది. మధ్య భారత్‌లో మహారాష్ట్ర నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు, కర్ణాటకలోని పడమర, కేరళ, ఈశాన్య భారత్‌లో తక్కువగా వర్షం పడుతుందని వివరించింది. ఆగస్టు, సెప్టెంబరులో రాయలసీమ, కోస్తాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం, అంత కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం సాధారణం లేదంటే అంతంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మరోవైపు, తూర్పు, ఈశాన్య భారత్‌లో జూన్‌లో వర్షపాతం అధికంగా నమోదైంది. మధ్య భారత్‌లో లోటు వర్షపాతం పడింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)