పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు

Telugu Lo Computer
0


ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా పాలస్తీనా గాజా సిటీపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ ' బ్రేకింగ్ డాన్ ' పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ వారం ప్రారంభంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సీనియర్ మిలిటెంట్ ను ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఇటు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయిల్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ ఉగ్రవాద కమాండర్ తో సహా మొత్తం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాజా స్ట్రిప్ లో ఉగ్రవాదులు ఉన్న భవనంపై ఇజ్రాయిల్ ఢిపెన్స్ ఫోర్సెస్ దాడులు చేసింది. దాడులకు ముందు ఇజ్రాయిల్ తన భూభాగంలో సరిహద్దుకు 80 కిలోమీటర్ల లోపు ప్రజల కార్యకలాపాలను తగ్గించింది. ఇటీవల వెస్ట్ బ్యాంకులో ఇస్లామిక్ జీహాద్ టెర్రరిస్ట్ నాయకుడుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతీకారదాడులకు పాలస్తీనా పాల్పడే అవకాశం ఉండటంతో సరిహద్దులకు సైన్యాన్ని పంపింది. గత 15 ఏళ్లుగా పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయిల్ కు మధ్య 4 యుద్ధాలు జరిగాయి. ఇటీవల జెరూసలెం ప్రాంతాల్లో కూడా ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం పాలస్తీనాలోని ఇస్లామిక్ జీహాద్, హమాస్ రెండూ ఇజ్రాయిల్ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)