బ్రిట్నీ గ్రైనర్‌కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 5 August 2022

బ్రిట్నీ గ్రైనర్‌కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష


అమెరికా బాస్కెట్‌బాల్‌ స్టార్‌ బ్రిట్నీ గ్రినర్‌కి డ్రగ్స్‌ అక్రమ రవాణా విషయంలో రష్యా తొమ్మిదేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు మాస్కో వచ్చిన బ్రిట్నీ, ఎయిర్‌పోర్టులో నిర్వహించిన కస్టమ్‌ తనిఖీల్లో మాదక ద్రవ్యాలతో పట్టుబడింది. ఆమె లగేజీలో హాషీష్ ఆయిల్ ఉన్న కాట్రిడ్జ్‌లు కనిపించడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో బ్రిట్నీపై విచారణ జరిపారు. ఆమె ఉద్దేశ్య పూర్వకంగానే మాదకద్రవ్యాలను తీసుకువచ్చి తప్పు చేశారని ప్రాసిక్యూటర్ నికోలాయ్ వ్లాసెంకో కోర్టులో వాదించారు. ఈ సందర్భంగా బ్రిట్నీ గ్రినర్‌ కూడా తన నేరాన్ని అంగీకరించింది. దీంతో మాస్కో ప్రాంతంలోని ఖిమ్కి సిటీ కోర్టు న్యాయమూర్తి అన్నా సోట్నికోవా గురువారం శిక్షను ఖరారు చేశారు. కోర్టు గ్రైనర్‌కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష, ఒక మిలియన్ రూబిళ్లు (రూ. 13.1 లక్షలు) జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. కాగా.. కోర్టు తీర్పుపై బ్రిట్నీ గ్రినర్‌ స్పందించారు. ఇది తాను ఉద్దేశ్య పూర్వకంగా చేసిన తప్పు కాదంటూ వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పుతో క్రీడాకారిణిగా తన జీవితం ముగిసిదని భావించడం లేదని వ్యాఖ్యానించారు. బ్రిట్నీ గ్రైనర్‌పై నేరారోపణ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. రష్యా బ్రిట్నీని తప్పుగా నిర్బంధిస్తోందని.. ఇది ఆమోదయోగ్యం కాదంటూ సూచించారు. ఆమెను వెంటనే విడుదల చేయాలటూ రష్యాను కోరుతున్నట్లు ప్రకటించారు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా రష్యాలో గ్రైనర్ నిర్బంధంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రైనర్.. రెండుసార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత,. మహిళల జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ లో స్టార్ ప్లేయర్. బ్రిట్నీ గ్రినర్‌ వ్యవహారంపై అమెరికా ఇప్పటికే దృష్టి సారించింది. ఆమెను రప్పించడానికి అమెరికా విదేశాంగమంత్రి బ్లింకన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రష్యా చెరలో బాస్కెట్‌బాల్‌ స్టార్‌ బ్రిట్నీ గ్రినర్‌తో పాటు మాజీ అమెరికా అధికారి పాల్‌ వీలన్‌ బందీలుగా ఉన్నారు.. వీరిద్దరినీ విడచిపెట్టాలంటే అమెరికా జైలులో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న తమ దేశస్తుడైన ఆయుధాల స్మగ్లర్‌ విక్టర్‌బౌట్‌ను విడుదల చేయాలని రష్యా షరతు విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహరంపై అమెరికాతో చర్చలకు సిద్ధమన్నారు రష్యా విదేశాంగమంత్రి లవరోవ్‌. ఇరు దేశాల మధ్య ఖైదీల వ్యవహారంపై త్వరలోనే చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments:

Post a Comment