ప్రపంచపు చివరి అంచు కి రోడ్డు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 August 2022

ప్రపంచపు చివరి అంచు కి రోడ్డు !


నార్వేలో ఉండే యూరోపియన్ రోడ్ 69 పై వెళ్తుంటే ప్రపంచం అంచుకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఇలాగే వెళ్తే ఆకాశంలోకి వెళ్లిపోతామా! అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు ఉత్తర ధృవం వైపుగా వెళ్తూ, భూమి చివరి అంచు వరకూ వెళ్తుంది. భూమిపై అంచున నార్త్ పోల్‌కు దగ్గర్లో ఉండే కొన్ని మారుమూల ఐల్యాండ్స్‌ను మిగతా ప్రపంచంతో కలిపే రోడ్డే యూరోపియన్ 69 హైవే. మంచుతో గడ్డకట్టి ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మించడానికి సుమారు వందేండ్లు పట్టింది. ఈ హైవేను 1909లో మొదలుపెడితే 1999లో పూర్తయింది. ప్రపంచంలో పోల్స్‌కు ఇంత దగ్గరగా నిర్మించిన ఒకే ఒక్క రోడ్డు ఇది. అందుకే దీన్ని 'మార్వెల్ ఆఫ్ ఇంజనీరింగ్' అంటారు. ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తుంటే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. లోయలు, ఎత్తైన గుట్టలు, ప్రపంచంతో సంబంధం లేని చిన్న చిన్న గ్రామాలుంటాయి. ఈ రోడ్డు చిట్టచివరి ప్రాంతాన్ని 'నార్డ్‌కాప్' అంటారు. 'ప్రపంచపు చివరి అంచు' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం ఉత్తర ధృవానికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ సమ్మర్‌లో ఆరు నెలల పాటు సూర్యుడు అస్తమించడు . అలాగే వింటర్‌లో ఆరు నెలల పాటు అసలు సూర్యుడు ఉదయించడు. మనుషులతో సంబంధం లేకుండా వందల ఏండ్ల నుంచి జీవిస్తున్న ఎంతోమందిని ఈ రోడ్డు ప్రపంచంతో కలిపింది. అంతేకాదు ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని ఈ రోడ్డు సింబాలిక్‌గా చెప్తోంది.

No comments:

Post a Comment