ఎస్ఎస్ఎల్వీ-డీ1 విఫలం !

Telugu Lo Computer
0


ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం అయినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ డీ1 ద్వారా రెండు శాటిలైట్లను ఈ రోజు నింగిలోకి ప్రయోగించింది. అయితే మొదటి మూడు దశలు సక్సెస్ ఫుల్ గా సాగాయి. టెర్మినల్ స్టేజీలో మాత్రం ఉపగ్రహాలతో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. మూడో దశ తరువాత ఈఓఎస్ 2, ఆజాదీ ఉపగ్రహాలను కక్ష్య లోకి విడిచిపెట్టింది. అయితే ఆర్బిట్ లోకి చేరిన తర్వాత ఉపగ్రహాల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. చివరి దశలో ప్రయోగం విఫలం అయినట్లు తెలిసింది. ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. మొత్తమ్మీద నేటి ప్రయోగం అంచనాలను అందుకోలేకపోయిందని వెల్లడించింది. దీనికంతటికీ కారణం ఓ సెన్సార్ పని తీరులో లోపమేనని ఇస్రో తెలిపింది. అందుకే ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలో ప్రవేశించాయని పేర్కొంది. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ సిఫారసుల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ఇస్రో వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)