చిన్నారిని చితకబాదిన శిక్షా మిత్ర

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్​ జిల్లా అసోహా మండలం ఇస్లామ్​ నగర్ ప్రభుత్వ​ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఓ చిన్నారిని శిక్షా మిత్ర దారుణంగా కొట్టిన తీరు ఆందోళన కలిగించేలా ఉంది. క్లాస్‌ రూమ్‌ అల్లరి చేసిందని, హోం వర్క్‌ చేయలేదన్న కారణంతో ఐదేళ్ల చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి బోరున ఏడుస్తున్నా ఆ ఉపాధ్యాయురాలు కనికరించలేదు కదా ఇంకా కొట్టడం ఎక్కువ చేసింది. ఈ ఘటన జూలై 9వ తేదీన చోటుచేసుకోగా అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలిని నిలదీశారు. మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. టీచర్ తో హామీ లేఖ రాయించుకున్నారు.చిన్నారిని కొడుతున్నప్పుడు ఎవరో కిటికీ నుంచి వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. పోలీసులు ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)