హత్య చేసి, శవాన్ని కాల్చి బూడిద చేశాడు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 July 2022

హత్య చేసి, శవాన్ని కాల్చి బూడిద చేశాడు !


బెంగళూరులో నివాసం ఉంటున్న నగీనా ఖానం అలియాస్ నగీనా (32) అనే మహిళకు 10 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. నగీనాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత నగీనా, ఆమె భర్త మద్య గొడవలు మొదలైనాయి. తరువాత నగీనా ఆమె భర్తతో విడిపోయింది. ఇద్దరు కొడుకుల్లో ఓ కొడుకు నగీనా దగ్గర, మరో కొడుకు ఆమె భర్త దగ్గర ఉన్నారు. యాదగిరి జిల్లాలోని హణుసగి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ బెంగళూరు చేరుకుని జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నగీనా బెంగళూరులోనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం మోహమ్మద్, నగీనాకు పరిచయం అయ్యింది. మోహమ్మద్ ను ప్రేమించిన నగీనా అతని రెండో పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త మోహమ్మద్ తో నగీనా కంగేరి ఉపనగర సమీపంలోని సన్ సిటీలోని అద్దె ఇంటిలో ఆరు సంవత్సరాల నుంచి కాపురం చేస్తోంది. ఇటీవల భార్య నగీనా మీద ఆమె రెండో భర్త మోహమ్మద్ అనుమానం పెంచుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నగీనా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె రెండో భర్త మోహమ్మద్ కు అనుమానం పెరిగిపోయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న తన రెండో భార్య నగీనా అందుకే ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం, ఇంటికి రావడం చేస్తోందని, ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను మోసం చేస్తోందని నగీనా మీద ఆమె రెండో భర్త మోహమ్మద్ కు అనుమానం మొదలైయ్యింది. తన భార్య నగీనాను చంేయాలని ఆమె రెండో భర్త మోహమ్మద్ స్కెచ్ వేశాడు.తన భార్య నగీనా నన్ను మోసం చేస్తోందని, ఆమెను చంపేయాలని మోహమ్మద్ అతనితో పాటు జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్న దోడ్డబళ్లాపురం సమీపంలోని సోణ్ణేనహళ్లికి చెందిన ప్రజ్వల్ అనే యువకుడికి చెప్పాడు. రామసంద్ర సమీపంలోకి నగీనాను పిలుచుకుని వెళ్లిన మోహమ్మద్ ఆమెను చంపేశాడు. ఫ్రెండ్ ప్రజ్వల్ సహాయంతో నగీనా శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చేసి అక్కడి నుంచి పరారైనారు. కాలిపోయిన మహిళ ఆచూకి ఏమాత్రం చిక్కలేదు. అయితే హత్యకు గురైన నగీనా చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకున్న పోలీసులు ప్రైవేట్ కంపెనీలు చుట్టూ తరిగి అందరి నుంచి వివరాలు సేకరించారు. నగీనాతో పాటు పని చేస్తున్న ఓ వ్యక్తి ఆ ఉంగరం గుర్తు పట్టడంతో అక్కడ కథ మలుపు తిరిగింది. నగీనాను హత్య చేసిన ఆమె రెండో భర్త మోహమ్మద్ యాదగిరిపారిపోయాడని, కొన్ని రోజుల తరువాత బెంగళూరు రావడంతో అతన్ని అరెస్టు చేశామని, నగీనా హత్యకు సహకరించిన ప్రజ్వల్ ను అరెస్టు చేశామని బెంగళూరు పోలీసలు తెలిపారు.

No comments:

Post a Comment