భారత్ ఖాతాలో మరో స్వర్ణం

Telugu Lo Computer
0


కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుంగా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్ లో 19 ఏళ్ల కుర్రాడు రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది. జెరెమీ లాల్ రిన్నుంగా తన మొదటి స్నాచ్ ప్రయత్నంలో 136 కిలోలు ఎత్తాడు. ఆ తరువాతి ప్రయత్నంలో 140 కిలోలను విజయవంతంగా పూర్తిగా చేశారు. క్లీన్ అండ్ జెర్క్ లో మొదటి ప్రయత్నంలో 154 కిలోల ఎత్తిన జెరెమీ.. రెండో ప్రయత్నంలో 160 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కేజీలకు పైగా ఎత్తి ఓవరాల్ రికార్డు సృష్టించాడు. జెరెమీ స్వర్ణ పతకంతో భారత్ రెండు స్వర్ణాలతో మొత్తం ఐదు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలాఉంటే 2018 యూత్ ఒలింపిక్స్ లో మొత్తం 274 కేజీల బరువుతో స్వర్ణ పతకాలను గెలచుకున్న ముగ్గురు భారతీయ అథ్లెట్లలో జెరెమీ మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆ సమయంలో అతని వయస్సు 16ఏళ్లు. అతను మరుసటి సంవత్సరం వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పురుషుల 67 కిలోల ఈవెంట్‌లో 21వ ర్యాంకింగ్‌తో ముగించాడు. వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ. 30లక్షలు నగదు రివార్డు ప్రకటించారు. సంకేత్ ట్రైనర్ కు రూ. 7లక్షల రివార్డును ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)