పోలీస్‌స్టేషన్‌లోనే పోలీస్‌ ఫై దాడి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

పోలీస్‌స్టేషన్‌లోనే పోలీస్‌ ఫై దాడి !


ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తిపై అందిన గృహ హింస ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల కౌన్సిలింగ్ తో విసిగిపోయిన వ్యక్తి ఏకంగా పోలీసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అతడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ అతను పోలీసుపై దాడి చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక పోలీసుతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటి తర్వాత, ఆ వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోయి, పోలీసులపై అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడం ప్రారంభించాడు. ఆపకుండా పోలీసును చావగొట్టాడు. ఇక అక్కడే ఉన్న పోలీసులు దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సదరు వ్యక్తిని కంట్రోల్ చేసె ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కుర్చీ అడ్డుపెట్టి కొట్టకుండా ఆపే ప్రయత్నం చేసింది. మొయిన్‌పురి ఏఎస్పీ మధువన్ కుమార్, తెలిపిన వివరాల ప్రకారం, గృహ హింస ఫిర్యాదుపై అతన్ని పిలిచి విచారిస్తున్నామని, ఈ క్రమంలో అతడు లోపల ఉన్న ఒక పోలీసు అధికారిని కొట్టారని పేర్కొన్నారు. వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉన్నాడని అతని కుటుంబం పోలీసులకు చెప్పారని పేర్కొన్న ఆయన , అయితే అతను నిజంగానే మానసిక అనారోగ్యంతో ఉన్నాడని, అందుకు సంబంధించిన మెడికల్ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే మేము దానిని పరిగణనలోకి తీసుకుంటాము అని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు మొయిన్‌పురి పోలీసులు వెల్లడించారు. పట్టరాని కోపంతో పోలీసుపై దాడికి పాల్పడిన వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేనా మీ పోలీసుల పరిస్థితి? అంటూ యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. యూపీ పోలీసులను ఎవరైనా కొడతారు. కానీ మరో పోలీసు కూడా అతనికి సహాయం చేయలేదు. కుర్చీతో కొట్టటానికి వెళ్లి అదే కుర్చీతో దెబ్బలు తిన్నాడు. ఇలాంటి పోలీసులను చూసి జిహాదీ గూండాలు భయపడతారని అనుకుంటున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందని చెప్తున్నారు. ఆవేశం ఫలితం జైలు పాలయ్యాడని అని అంటున్నారు. 

No comments:

Post a Comment