యువ బాక్సర్ కుల్దీప్ సింగ్ మృతి

Telugu Lo Computer
0


పంజాబ్‌ బటిండా జిల్లాలోని తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ నేషనల్ లెవెల్ బాక్సర్. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. మొత్తంగా ఐదు పతకాలను గెలుచుకున్నాడు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుల్దీప్.. గురువారం ఉదయం గ్రామ శివారులోని పంట పొలాల్లో విగతజీవిగా కనిపించాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే అతని మృతదేహం పక్కన హెరాయిన్, మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల కుల్దీప్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై కుల్దీప్ తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. కుల్దీప్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)