కేజ్రీవాల్ ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్న సింగపూర్ ప్రభుత్వం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 July 2022

కేజ్రీవాల్ ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్న సింగపూర్ ప్రభుత్వం


వరల్డ్ సిటీస్ సమ్మిట్ 2022 సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సింగపూర్ ప్రభుత్వం పలికిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది. జులై 20 నాటికే ఇన్విటేషన్‌కు తెలియజేయాల్సిన ఆమోదాన్ని పట్టించుకోకపోవడంతో ఇలా చేసినట్లు మీడియాలో వచ్చింది. ఈ చర్య ఢిల్లీ నగరానికి, దేశానికి అవమానం తెచ్చిపెట్టిందని ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. గత నెలలో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ప్రపంచ నగరాల సదస్సుకు కేజ్రీవాల్‌కు ఇన్విటేషన్ పంపారు. సీఎం పర్యటనకు గానూ కేంద్రం పర్మిషన్ కోరుతూ జూన్ 7న ఎల్జీకి ఫైల్ పంపినప్పటికీ అది జూలై 21న తిరిగొచ్చింది. కేజ్రీవాల్ సైతం సదస్సుకు హాజరయ్యేందుకు అనుమతి కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఢిల్లీ సీఎం సింగపూర్ పర్యటనకు పొలిటికల్ అప్రూవల్ కావాలని కోరిన రిక్వెస్ట్ గత వారమే అందుకుంది. ఆ ఆహ్వానంలో పలు కొత్త విషయాలు, మార్పులు పంచుకున్నట్లు అర్థమైంది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరణ ఇచ్చారు. “గత వారం చెప్పినట్లుగానే జులై 21న పొలిటికల్ క్లియరెన్స్ పోర్టల్ లో ఎంట్రీ వచ్చింది” అన్నారు. సిటీ మేయర్ల సమావేశానికి సీఎం హాజరుకావడం తగదని భావించామని.. ఎల్జీ కార్యాలయానికి ఫైల్ తిరిగి పంపినట్లు వెల్లడించారు. దాంతో కేజ్రీవాల్ పర్యటనకు అనుమతి కోసం ఎంఇఏ కు దరఖాస్తు చేసుకున్నారు.


No comments:

Post a Comment