పెరుగు గడ్డ కట్టినట్లు తయారు కావాలంటే ?

Telugu Lo Computer
0


గడ్డ పెరుగు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నీళ్లలాగా పెరుగు ఉంటే చాలా మందికి నచ్చదు. గడ్డ కట్టినట్లు రాయిలా ఉంటేనే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ కొందరు పెరుగును గడ్డ కట్టినట్లు తయారు చేయలేకపోతుంటారు. నీళ్లలాగే పెరుగు తయారవుతుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా గడ్డ పెరుగు తయారవ్వదు. ఒక లీటర్ పచ్చి పాలలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ను వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా కలిపిన పాలను స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై బాగా మరిగించాలి. కార్న్ ఫ్లోర్ కలిపాం కనుక పాలను మరిగే వరకు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలు వేడిగా ఉండగానే అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమంపై మూత పెట్టి చీకటి ప్రదేశంలో కదిలించకుండా 6 గంటల పాటు ఉంచాలి. అలా ఉంచిన తరువాత మరో 4 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డ పెరుగు తయారవుతుంది. ఇది రాయిలా గడ్డ కట్టినట్లు ఉంటుంది. పాత్రను బోర్లించినా పెరుగు ఏమాత్రం కింద పడదు. అలా జరిగితే గడ్డ పెరుగు తయారైనట్లు లెక్క. ఇలా పెరుగును తయారు చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసిన పెరుగు ఎంతో రుచిగా ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)