తల నరికి,తలతో పోలీసు స్టేషన్‌కు ...!

Telugu Lo Computer
0


కర్ణాటకలోని విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కన్న బొరనయ్యన హట్టికి చెందిన భోజరాజ్ అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన తమ సమీప బంధువు బసణ్ణ కుమార్తె నిర్మల (23) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్ధినిని ప్రేమించాడు. ఒకసారి వారి ఇంటికి వెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు బసణ్ణ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. నిర్మల కూడా తల్లి తండ్రుల మాట కాదనలేదు. రెండు నెలల క్రితం భోజరాజ్ కు మరో యువతితో వివాహాం అయ్యింది. కలబురిగిలో చదువుతున్న నిర్మల ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం బసణ్ణ ఇంట్లో నిర్మల ఒక్కతే ఉందని తెలుసుకున్న భోజరాజ్ వారింటికి వెళ్ళాడు. అక్కడ నిర్మలతో గొడవ పడ్డాడు. తనతో తీసుకు వెళ్లిన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు. తలను మొండెం నుంచి వేరు చేసి తన వద్ద ఉన్న సంచిలో పెట్టుకుని బైక్ పై పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)