కొడుకు మరణంతో కోడలిని గెంటేసిన అత్తమామలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలోని పాలాల వీధికి చెందిన కుమార్ ఆచారి సరళ దంపతుల కుమారుడు హరి ప్రసాద్ కు హైదరాబాద్ కవాడిగూడ కి చెందిన స్వర్ణలతకు 13 ఏళ్ళ క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి పల్లవి (12), సంతోష్ (11) సంతానం. గత నాలుగేళ్లుగా హరిప్రసాద్ ఆరోగ్యాని సరిగా లేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారు. వైద్యం చేయించుకున్న హరి ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడలేదు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి స్వర్ణ అత్తగారి ఇంటివద్దే ఉంటోంది. కొడుకు చనిపోయిన కొన్నాళ్ల నుంచి కోడలిపై అత్తమామలు అనుమానం పెంచుకున్నారు. ముందుగా కన్న బిడ్డలను దూరం చేయాలనీ సంకల్పించారు. పధకం ప్రకారం స్వర్ణ కన్నబిడ్డలకు లేని పోని మాటలు చెప్పేవారు. తల్లి గురించి పిల్లలకు చెడుగా చెప్పి ఆమెపై మనసు విరిగిపోయేలా చేశారు. మెల్లగా స్వర్ణపై వేధింపులు ప్రారంభించారు. సూటిపోటి మాటలతో ఇబ్బందులకు నిత్యం వేధిస్తూ ఉండేవారు. నీ వల్లే మా కుమారుడు చనిపోయాడంటూ నిందలు మోపేవారు. పిల్లల కోసం అన్నీ భరిస్తూ వచ్చిన స్వర్ణ అత్తారింటిలోనే ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని, పెట్టే బేడా సర్ది బయటకు తరిమేశారు. ఇంట్లోకి వెళ్లకుండా లోపల తాళాలు వేసేసారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న స్వర్ణ అత్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కన్నబిడ్డలనైనా తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)