మట్కా బుక్కీ యంకప్పకిడ్నాప్ !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కలబురిగి  చెందిన యంకప్ప మట్కా బుక్కీగా  డబ్బులు బాగా సంపాధించాడు. స్థానికులు యంకప్పను పేరుతో పిలవకుండా మట్కా బుక్కీగానే ఎక్కువగా పిలుస్తారు. యంకప్ప దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందని నిందితులకు తెలిసిపోయింది. మట్కా బుక్కీగా పేరు సంపాధించుకున్న యంకప్ప కొంతకాలం డబ్బులు బాగా సంపాధించాడు. మట్కా బ్యాన్ తో యంకప్ప కొంతకాలం సీక్రేట్ గా బుక్కీగా పని చేశాడు. మట్కా వ్యాపారం దిగజారిపోవడంతో యంకప్ప మరో వ్యాపారం చేస్తున్నాడు. కలబురిగి జిల్లాలకు చెందిన బసవరాజ్, క్రిష్ణ, జానేష్ అనే ముగ్గురు పోలీసు దస్తులు ధరించి యంకప్ప దగ్గరకు వెళ్లారు, మేము సీబీఐ అధికారులు, నిన్ను విచారణ చెయ్యాలని చెప్పారు ఎందుకు అని యంకప్ప ప్రశ్నిస్తే నువ్వు మట్కాకు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నావని అతన్ని బెదిరించారు. మాజీ మట్కా బాస్ యంకప్పను కారులో కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి నిన్ను జైలుకు పంపిస్తాము అంటూ బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు అతన్ని రూ.11 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తామని నిందితులు అతన్ని బెదిరించారు. చివరికి యంకప్ప తనను వదిలి పెడితే రెండు గంటల్లో లక్షరూపాయలు తీసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో బసవరాజ్, క్రిష్ణ, జానేష్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని, మరో నిందితుడు తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)