విజయమ్మ రాజీనామాపై వంగలపూడి అనిత వ్యంగ్యస్త్రాలు !

Telugu Lo Computer
0


వైసీపీ గౌరవ అధ్యక్ష పదవీకి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. జగన్ శాశ్వత అధ్యక్ష పదవీ చేపట్టనుండటంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చిందెమో...? దీనిపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ముఖ్యంగా వంగలపూడి అనిత.. వైసీపీ, జగన్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. చెల్లి, తల్లి అయిపోయారు.. మరీ నెక్ట్స్ ఎవరినీ పంపిస్తారో అని ఘాటు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో కూడా.. ఆ 16 నెలలు అందరినీ సమన్వయం చేశారు. అయితే జగన్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. జగన్ కోసం పాదయాత్ర కూడా చేసిన చెల్లి వైఎస్ షర్మిల పార్టీని వీడారు. తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. జగన్ అన్న వదిలిన బాణాన్ని అని పాదయాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఎన్నికలు ముగిసి.. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన ఆమెకు పదవీ లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె పార్టీని వదిలారు. ఇప్పుడు విజయమ్మ వంతు రానే వచ్చింది. ఆమె కూడా పార్టీ గౌరవ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. దీంతో చెల్లి తర్వాత తల్లి పార్టీకి దూరం అయ్యారు. జగన్ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవీ చేపట్టనున్నారనే ముందే లీక్ ఇచ్చారు. ఇవాళ ప్లీనరీలో విజయమ్మ రాజీనామా చేశారు. ఆమె పార్టీ కోసం శ్రమించారు. భర్త వైఎస్ఆర్ ఉన్న సమయంలో రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కానీ కుమారుడి వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గానే పనిచేశారు. కానీ ఇప్పుడు మారిన సమీకరణాలు.. లెక్కలతో ఆమె కూడా పార్టీని వీడాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని టీడీపీ అనిత సెటైరికల్‌గా చెప్పేశారు. బైబై చెల్లీ అయిపోయింది.. ఇప్పుడు బైబై తల్లి అయిపోయింది అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు నెక్ట్స్ ఎవరో మరీ అని కూడా రాశారు. అంటే జగన్‌కు సన్నిహితంగా ఉంటే.. వాడుకొని వదిలేస్తారని.. ఎల్లకాలం ఉండనీయరని చెప్పారు. వాడుకొని వదిలేయడంలో జగన్‌ను మించినవారు లేరని విరుచుకుపడ్డారు. సో.. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటే వారు కూడా భవిష్యత్‌లో దూరం కావాల్సిందేనని చెప్పకనే చెప్పారు. మరీ అనిత కామెంట్లపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలీ మరీ.

Post a Comment

0Comments

Post a Comment (0)