సభకి తప్పతాగి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు !

Telugu Lo Computer
0


పీకల దాకా మందు తాగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయాన్నీసెలబ్రేట్ చేసుకున్నాడు గుజరాత్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రష్మికాంత్ వాసవా. తప్పతాగి తూలుతూ.. నడవలేని స్థితిలో విజాయోత్సవ సభలో ఈ బీజేపీ అధ్యక్షుడు చేసిన హల్చల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పేరుకే దర్మం, దేవుడు కానీ ఈ బీజెపోళ్ళంతా గుడివెనుక నా సామి అన్నట్టు మందుబాబుల మాదిరి తయ్యారయ్యారంటూ నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేశారు. దాంతో మన గుజరాత్ ఫెక్ ప్రమోషన్స్ పీఎం మోదీ పరువు సొంత రాష్ట్రంలో బ్రష్టుపట్టింది. 'మోదీ వారసులు చూడండి గుజరాత్ లో' అంటూ ప్రజల నుండి వస్తున్న కామెంట్స్, ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోలేకా తన పదవికి ఈ ఛోటా ఉదేపూర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. గుజరాత్‌లోని ఛోటా ఉదేపూర్ జిల్లాలో ద్రౌపది ముర్ము ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని జరిగిన విజయోత్సవ సభలో.. రష్మికాంత్ మద్యం మత్తులో తూలుతున్న వీడియోపై భారీగా విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ లో మద్య నిషేదమని ప్రగల్బాలు పలికే మోదీ బ్యాచ్ కి ఇది షాకింగ్ పరిణామం. మధ్య నిషేదమున్న రాష్ట్రంలో ఒక అధ్యక్ష పదవిలో ఉండి అతను ఎంత దైర్యంగా మద్యం సేవించి అధికారిక కార్యక్రమంలో ఒక మహిళ పక్కన కూర్చుంటాడని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈవెంట్ సమయంలో రష్మికాంత్ వాసవా మద్యం మత్తులో వేదికపై కూర్చొని నిద్రపోతున్నట్లు కూడా కనిపిస్తున్న ఈ వీడియోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)