విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 27 July 2022

విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు


విశాఖపట్టణం-బెంగళూరు-విశాఖపట్టణం మధ్య ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.08543 విశాఖపట్టణం-ఎస్ఎంబీటీ బెంగళూరు ప్రత్యేక ఛార్జీ రైలు ఆగస్టు 7,14,21,28, సెప్టెంబరు 4,11,18,25 తేదీలు (ఆదివారం) మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖలో బయల్దేరి మంగళవారం ఉదయం 9 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే, నెం.08544 ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-విశాఖ ప్రత్యేక ఛార్జీ రైలు ఆగస్టు 8,15,22,29, సెప్టెంబరు 5,12,19,26 (సోమవారం) మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూర్‌, గూడూరు(Gudur), రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment