ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయితీ !

Telugu Lo Computer
0


చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని నవ రాయ్ పూర్ కయాబంధ పోస్ట్ లో నీలాంబర్ సిన్హా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు వద్ద డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా రాయ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో రోడ్డు మీద తెల్లరంగు బ్యాగు కనిపించింది. దానిని తీసుకుని చూడగా అందులో రూ.500, 2000 నోట్ల కట్టలు కనిపించాయి. సుమారు రూ. 45 లక్షలు ఉన్నాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ లో బ్యాగు అప్పగించాడు. నోట్ల కట్టలతో బ్యాగు దొరికితే తిరిగి తీసుకువచ్చి ఇచ్చి నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అందరూ మెచ్చుకున్నారు.  ట్రాఫిక్ కానిస్టేబుల్  రివార్డు ప్రకటించారు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా నీలాంబర్ సిన్హాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 'ట్రాఫిక్ కానిస్టేబుల్ నీలాంబర్ సిన్హా వంటి నిజాయితీపరులు నేటి కాలంలో సమాజానికి నిజాయితీకి పర్యాయపదాలు. క్లెయిమ్ చేయని స్థితిలో రూ. 45 లక్షలతో కూడిన బ్యాగ్‌ని నీలాంబర్‌కు అందింది, దానిని అతను తిరిగి ఎస్‌ఎస్‌పి రాయ్‌పూర్‌కు చేరుకున్నాడు. ఇలాంటి నిజాయితీపరులు సమాజానికి ఆదర్శం. మేమంతా ఆయనకు నమస్కరిస్తాం అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)