నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ సంతోషమే లేదు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 July 2022

నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ సంతోషమే లేదు !


ఒక బస్సు కండెక్టర్ స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎదిగి స్టార్ హీరోగా మారిన రజినీకాంత్. సూపర్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు. సినిమాలు లేనప్పుడు, ఖాళీగా ఉన్న సమయంలో రజినీకాంత్ హిమాలయాలకు వెళ్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఆధ్యాతికత అంటే రజినీకాంత్ కి చాలా ఇష్టం. ప్రశాంతత కోసం దైవారాధన చేస్తూ ఉంటారు. తాజాగా చెన్నైలో ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ త్రూ క్రియా యోగ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ  నా జీవితంలో డబ్బు, పేరుప్రఖ్యాతలు ఉన్నాయి కానీ సంతోషమే లేదు అనే వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ”నేను గొప్ప నటుడినని అందరూ అంటుంటారు. ఇది ప్రశంసో, విమర్శో నాకు అర్థం కాదు. నా సినీ జీవితంలో రాఘవేంద్ర, బాబా.. ఈ రెండు సినిమాలు నాకు ఆత్మ సంతృప్తిని కలిగించాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలు వెళ్లామని, నా అభిమానులు కొందరైతే సన్యాసులుగా మారిపోయామని చెప్పారు. కానీ నేను మాత్రం ఇంకా ఇక్కడ నటుడిగానే కొనసాగుతున్నాను.” ”హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయి. అవి తింటే వారానికి సరిపడా శక్తి లభిస్తుంది. ఆరోగ్యం మనిషికి చాలా ముఖ్యమైంది. అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సిన వాళ్లు తట్టుకోలేరు. నేను నా జీవితంలో చాలా డబ్బు, పేరు, ప్రఖ్యాతలు సంపాదించాను. కానీ సంతోషం, ప్రశాంతత మాత్రం పది శాతం కూడా సంపాదించలేకపోయాను. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కావు” అని అన్నారు. రజినీకాంత్ సంతోషంగా లేను అని అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


No comments:

Post a Comment