ప్రాంతీయ పార్టీల విరాళాల సేకరణలో జేడీయూ అగ్రస్థానం

Telugu Lo Computer
0

 


దేశంలోని ప్రాంతీయ పార్టీల విరాళాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక విడుదల చేసింది. అన్ని ప్రాంతీయ పార్టీల్లోకెళ్లా జనతాదళ్ యునైటెడ్ అగ్రస్థానంలో ఉంది. డీఏంకే రెండో స్థానంలో ఉండగా, ఆప్ మూడో స్థానం దక్కించుకుంది. టీఆర్ఎస్‌ ఐదో స్థానానికి పరిమితమైంది. మొత్తం విరాళాల్లో 91 శాతానికి పైగా 113.79 కోట్లు ఐదు పార్టీలకే వెళ్లినట్టు ఏడీఆర్‌ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల ఆధారంగా ఏడీఆర్‌ నివేదికను రూపొందించింది. అధిక విరాళాలు ప్రకటించిన మొదటి ఐదు ప్రాంతీయ పార్టీల్లో జనతా దళ్‌ జేడీయూ, డీఎంకే, ఆప్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, టీఆర్‌ఎస్‌ ఉన్నాయి. జేడీయూ 330 విరాళాల ద్వారా 60.15 కోట్లు అందుకుంది. 177 విరాళాలతో 33.99 కోట్లు డీఎంకే పార్టీకి వచ్చాయి. 11.32 కోట్లు విరాళాలు అందాయని ఆప్‌ ప్రకటించింది. ఇండియన్ ముస్లీం లీగ్‌ 4.16 కోట్లు, టీఆర్ఎస్‌కు 4.15 కోట్ల విరాళాలు దక్కాయి. 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం 124.53 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే విరాళాలు పెరిగినట్టు జేడీయూ, డీఎంకే, టీఆర్‌ఎస్‌ ప్రకటించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)