విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా?

Telugu Lo Computer
0


ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున మార్గరెట్ అల్వా బరిలోకి దిగనున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అల్వా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ప్రకటించారు. 80 ఏళ్ల మార్గరెట్ అల్వా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె స్వస్థలం కర్నాటకలోని మంగళూరు. ఆమె రాజస్థాన్, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. 1974 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. అనంతరం 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హయంలో కేంద్రమంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. 2014 ఆగస్టు 7 వరకు ఆమె గోవా గవర్నర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న మార్గరెట్ ఉపరాష్ట్రపతిగా విజయం సాధిస్తే.. రాజ్యసభను సమర్థవంతంగా నిర్వహిస్తారని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)