ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై అల్పపీడన ప్రభావం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. నిన్న ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం..ఇవాళ వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరంలో కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులపాటు వానలు పడనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆంధ్రప్రదేశ్ లోనూ అల్పపీడన ప్రభావం అధికంగా ఉంది. తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాంధ్ర చిరుజల్లులు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల పొడి వాతావరణం, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. తీరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)