తగ్గిన వంట నూనెల ధరలు

Telugu Lo Computer
0


గత కొద్ది నెలలుగా ఆకాశాన్ని తాకిన వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో రిటైల్‌ మార్కెట్‌లో వంట నూనెల ధరల తగ్గాయి. పెరుగుతున్నధరలను అరికట్టేందుకు దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో పలు కంపెనీలు ధరలు తగ్గించాయి. 20 రోజుల క్రితం అదానీ విల్మర్‌, మదర్‌ డైరీ పలు రకాల వంట నూనెలపై రూ. 10 నుంచి రూ.15 వరకు తగ్గించాయి. దీంతో రిటైల్ మార్కట్ లో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ కు రూ.175 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. అటు సోయా ఆయిల్ ధర కూడా తగ్గింది. జూన్‌లో ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం 35 నుంచి 55 శాతం ఉండగా, అప్పటి నుంచి ప్రభుత్వం క్రమంగా దిగుమతి సుంకాన్ని తగ్గించిందని, ప్రస్తుతం వివిధ వంట నూనెలపై జీరో శాతం నుంచి 15 శాతం వరకు ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)